సూర్యాపేట జిల్లా: ఖమ్మం నగరం నరసింహస్వామి గుట్ట వద్ద నివాసం ఉండే గ్రానైట్ క్వారీ వ్యాపారి వి. రంగనాధ్ శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా అనంత గిరి వద్దహత్య కు గురి అయ్యారు.. తమిళనాడు కు చెందిన రంగనాధ్ గ్రానైట్ రాయి వ్యాపారం కోసం ఖమ్మం వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు ఆయనకు ఖమ్మం చుట్టుప్రక్కల జిల్లాల్లో క్వారీలు ఉన్నాయి. కొంతమంది తో కల్సి అనంతగిరి వద్ద క్వారీకి వెళ్లినట్లు తెలిసింది. ఒక మహిళ విషయంలో జరిగిన వివాదంలో ఆమె సోదరుడు హత్యకు పునుకొన్నట్లు తెలుస్తోంది. ఆ..కోణంలో పోలీస్ లు విచారణ చేపట్టినట్లు తెలిసింది. మహిళ కుటుంబం కూడా తమిళనాడు నుండి వలస వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు సంఘటనా స్థలంలో కీలక ఆధారాలు సేకరించి.. ఒకరిని అదుపులోకి తీసుకొన్నట్లు సమాచారం.