ప్రభుధేవా రహస్యంగా రెండో పెళ్లి..?

ప్రభుధేవా రహస్యంగా రెండో పెళ్లి..?చెన్నై : ద‌ర్శ‌కుడు, కొరియోగ్రాఫర్‌ ప్రభుధేవా రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. బీహార్‌కు చెందిన ఫిజియోథెరపిస్ట్‌తో సెప్టెంబర్‌లోనే ఏడడుగులు వేశారు. ముంబైలోని ప్రభుదేవా నివాసంలో అత్యంత రహస్యంగా వివాహం చేసుకున్న ఈ కొత్త జంట ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుదేవాకు అత్యంత సన్నిహితులైన ఒకరు మీడియాతో పంచుకున్నారు. అయితే ఈ విషయంపై ప్రభుదేవా మాత్రం స్పందించలేదు. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంటుంది. గతంలో వెన్నముక సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రభుదేవా పిజియోథెరపీ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు చికిత్స అందించిన డాక్టర్‌తో ప్రభుదేవా ప్రేమలో పడ్డారు. కొంతకాలం డేటింగ్‌ అనంతరం వీరిద్దరూ పెళ్లిబంధంతో ఒకటయ్యారు. అయితే ప్రభుదేవా రెండో పెళ్లిపై గత కొంతకాలంగా కోలీవుడ్‌లో పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తన చుట్టాలమ్మాయితో రిలేషన్‌ షిప్‌లో ఉన్నట్లు త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తలు షికార్లు చేయగా ప్రస్తుతం అది ఫేక్‌ న్యూస్‌ అని స్పష్టమవుతోంది. మొదట 1995లో రామలతను వివాహం చేసుకున్నప్రభుదేవా 2011లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌ న‌య‌న‌తారతో ప్రేమ చిగురించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రేమ ఎక్కువ‌కాలం నిల‌వ‌లేదు.