అనంతపురంలో ప్రజల్ని వణికిస్తున్న చిరుత

అనంతపురంలో ప్రజల్ని వణికిస్తున్న చిరుతఅనంతపురం: జిల్లాలోని పామిడి మండలం దిబ్బ సాని పల్లి గ్రామ శివారులోని కొండల్లో రెండు చిరుత పులుల సంచారం ప్రజల్ని వణుకుపుట్టిస్తున్నాయి. ఇదే గ్రామానికి చెందిన మనోజ్(20) అనే గొర్రెల కాపరి నిన్నటి రోజున మేకలను మేపడానికి కొండ శివారు ప్రాంతాల్లోకి తీసుకెళ్ళాడు అదే సమయంలో మేకల గుంపును చూసిన చిరుతపులులు ఒకసారి మేకల గుంపు పై దాడి చేశాయి ఈ దాడిలో మూడు మేకల మృతి చెందగా కొన్ని మేకలకు గాయాలయ్యాయి. చిరుత దాడిని గమనించిన గొర్రెలకాపరి గట్టిగా కేకలు వేసాడు. దీంతో చిరుత పులి అతని పై దాడి చేయడానికి ప్రయత్నించగా వెంటనే అప్రమత్తమై గొర్రెల కాపరి అక్కడిని నుంచి పరారయ్యాడు. తిరిగి ఈరోజు ఉదయం కూడా చిరుతపులి అక్కడే సంచరిస్తుండడంతో దీన్ని చూసిన స్థానికులు ఈ వీడియోను తీసి మా గ్రామంలో చిరుత నుండి ప్రజలను కాపాడాలని పలువురు అధికారులకు షెర్ చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టి గ్రామంలో చిరుతపులి నుంచి ప్రజలను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.