రష్మిక మందన్నకు గూగుల్ సర్‌‌ప్రైజ్

హైదరాబాద్‌: సినిమా ఇండిస్ట్రిలో తన అందం, అభినయంతో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో మెప్పిస్తున్న క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక‌ మందన్న. ఈ ఏడాది స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ఈ అమ్మ‌డు అల్లు అర్జున్ స‌ర‌స‌న పుష్ప‌, శ‌ర్వానంద్ స‌ర‌స‌న ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలో న‌టిస్తుంది. ఆచార్య‌లో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. స్లో అండ్ స్ట‌డీగా టాలీవుడ్‌లో దూసుకెళుతున్న ర‌ష్మికకు గూగుల్ ఇండియా అరుదైన గుర్తింపునిచ్చింది.రష్మిక మందన్నకు గూగుల్ సర్‌‌ప్రైజ్గూగూల్ 2020 సంవత్సరానికి గాను ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా రష్మిక ఎన్నికైనట్టు ప్రకటించింది. గూగుల్ లో ఈ సెర్చ్ వర్డ్స్ టైప్ చేస్తే, రష్మిక పేరుతో పాటు ఆమెకు సంబంధించిన‌ సమాచారం కనిపిస్తోంది. గూగుల్ లో ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా 2020’ గా ర‌ష్మిక ఎంపిక కావ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. రష్మిక డ్రెస్సింగ్ స్టైల్ నచ్చడం వల్లే ఆమెని నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా నేషనల్ వైడ్ గా గుర్తించారట. ఆమె న‌టించిన తెలుగు, క‌న్న‌డ సినిమాలు ఇత‌ర భాష‌ల‌లో డ‌బ్ అయి విడుద‌ల కావ‌డంతో ఈ అమ్మ‌డికి దేశ వ్యాప్తంగా గుర్తింపు వ‌చ్చింది.