అబ్దుల్‌ సలాం కుటుంబం పరామర్శించిన జగన్

అబ్దుల్‌ సలాం కుటుంబం పరామర్శించిన జగన్ఏపి : అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారుకులైన దోషులపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏపీఎస్పీ గెస్ట్‌హౌస్‌ వద్ద సలాం కుటుంబాన్ని సీఎం జగన్‌ నేడు పరామర్శించారు. సలాం అత్త మాబున్నీసా, శంషావలీ, షాజిదాలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాబున్నీసా కుమార్తె షాజిదాకు ఔట్‌సోర్సింగ్‌ కింద ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా ఆమె అల్లుడు శంషావలిని అనంతపురం నుంచి నంద్యాలకు బదిలీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు