గ్రీన్ ఇండియా కోసం కృషి చేస్తా

గ్రీన్ ఇండియా కోసం కృషి చేస్తాహైదరాబాద్: సౌత్​ ఇండియన్​ పాపులర్​ సినీ నటి అనుపమ పరమేశ్వరన్​ గ్రీన్ ఇండియా ​ఛాలెంజ్​లో పాల్గొంది. టాలీవుడ్​ హీరో నిఖిల్​ విసిరిన గ్రీన్​ఇండియా ఛాలెంజ్​ను స్వీకరించిన అనుపమ  హైదరాబాద్​లోని బాచుపల్లిలో మొక్కనాటారు. రాజ్యసభ్యుడు జోగినపల్లి సంతోష్​కుమార్​ మొదలుపెట్టిన ఈ గ్రీన్​ఇండియా ఛాలెంజ్​ను నేను స్వాగతిస్తున్నాను. భవిష్యత్​లో దీన్ని ఇన్​స్పైర్​గా తీసుకుంటాను. ఈ కార్యక్రమం ద్వారా మొక్కలే వృక్షాలుగా మారి భావితరాలకు ఉపయోగపడి ప్రకృతి అందంగా తయారై అందరికి స్వచ్ఛమైన ఆక్సిజన్​ అందుతుంది. అందరు ఆరోగ్యంగా ఉండడానికి మొక్కల్ని పెంచడం ఎంతో అవసరం అని అనుపమ తెలిపింది. ప్రకృతిలో మొక్కలను కాపాడుకునే ఇంత మంచి ఈగ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లోకి అందరిని ఆహ్వానిస్తాను. దీని కోసం నావంతుగా కృషి చేస్తానని నటి అనుపమ చెప్పింది.