11 ,103 మందికి వరద సహాయం

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం 11 ,103 మందికి వరద సహాయంగా రూ. 11 .10 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. మంగళ, బుధ వారాల్లో 17 ,333 మందికి రూ. 17 .33 కోట్లను అందించారు. నగరంలో ఇప్పటి వరకు గత మూడు రోజులుగా 28 ,436 మందికి రూ. 28 .44 కోట్లను సంబంధిత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో జమ చేసినట్లు వెల్లడించింది.