రేవతికి సీఎం జగన్ ఫోన్ కాల్

రేవతికి సీఎం జగన్ ఫోన్ కాల్గుంటూరు జిల్లా: నిన్న గుంటూరులోని కాజా టోల్ గేట్ వద్ద జరిగిన ఘటనపై సీఎం జగన్ స్పందించారు. టోల్ గేట్ సిబ్బంది, ఉద్యోగిపై వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి దురుసుగా ప్రవర్తించి, చేయిచేసుకున్న దేవళ్ల రేవతిపై కేసు నమోదైంది. అయితే ఈ ఘటన గురించి తెలుసుకున్న సీఎం జగన్ వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతికి ఫోన్ చేసి మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వివరించాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. దీంతో సీఎం జగన్ ను కలిసేందుకు దేవళ్ల రేవతి సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ‌్తున్నట్లు సమాచారం. అయితే కాజా టోల్ గేట్ వద్ద చోటుచేసుకున్న ఘటనలో వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి చైర్ పర్సన్ పదవిపై వేటుపడే అవకాశాలు వున్నట్లు సమాచారం.