వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయమై గురువారం తెలంగాణ హైకోర్టు విచారించింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ముందుగానే స్లాట్ ను బుక్ చేసుకోవాలని ఆదేశించింది. ఆస్తి పన్ను, గుర్తింపు సంఖ్య కచ్చితంగా ఉండాలనే నిబంధనకు అంగీకరించింది. ధరణి పోర్టల్ పై దాఖలైన పిటిషన్ ను ఈ నెల 8వ తేదీన హైకోర్టు విచారించిన విషయం తెలిసిందే. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని ఆ రోజున హైకోర్టు సూచించింది. ఇవాళ మాత్రం వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెసులుబాటును కల్పించింది. ఆన్‌లైన్ పద్దతిలోనే వీటి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు.