గుజరాత్ సీఎం ఛీఫ్ అడ్వైసర్ గా హస్ముక్ ఆదియా

గుజరాత్ సీఎం ఛీఫ్ అడ్వైసర్ గా హస్ముక్ ఆదియా

వరంగల్ టైమ్స్, గుజరాత్ : గుజరాత్ ముఖ్యమంత్రి బుపేంద్ర పటేల్ ప్రధాన సలహాదారుడిగా హస్ముక్ ఆదియా నియమితులయ్యారు. హస్ముక్ ఆదియా కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి గా రిటైర్ అయ్యారు. అత్యంత వివాదాస్పద 86 శాతం నోట్ల రద్దు, జీఎస్టీ విధాన రూప కల్పన లో హస్ముక్ ఆదియా అతి ముఖ్య పాత్ర పోషించారు. సుప్రీమ్ కోర్ట్ రాజ్యాంగ ధర్మాసనం నోట్ల రద్దు పై జనవరి 2 న తన తుది తీర్పు వెల్లడించనుంది. అయిదుగురు సభ్యుల చిన్న టీం తో ప్రధాని నివాసంలో బస చేసి ఆర్బీఐ తో సహా ఎవ్వరికీ ముందస్తుగా తెలియకుండా నోట్ల రద్దు కసరత్తు ను పూర్తి చేశారు ఆదియా.గుజరాత్ సీఎం ఛీఫ్ అడ్వైసర్ గా హస్ముక్ ఆదియాగుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీ గా 11 ఏండ్లు పని చేసిన ఆదియా… మోడీ తో పాటే ఢిల్లీ కి షిఫ్ట్ అయ్యి..మోడీ కి నమ్మకస్థుడిగా వ్యవహరించాడు. చట్టాలు, నిబంధనలను కాదని నోట్ల రద్దు, జీఎస్టీ అమలు విషయాల్లో మోడీ మాటను నెగ్గించారు. ప్రధాని మోడీకి యోగ గురువుగా హస్ముక్ ఆదియాను చెప్పుకుంటారు. తాజాగా గుజరాత్ సీఎం కి ప్రదాన సలహదారుడిగా నియమితులయ్యారు.