ముత్యాల ప్రసాద్​ మృతి మీడియా ప్రపంచానికి లోటు: ఐజేయూ

ముత్యాల ప్రసాద్​ మృతి మీడియా ప్రపంచానికి లోటు: ఐజేయూహైదరాబాద్​ : విశాలాంధ్ర పత్రిక సంపాదకులు ముత్యాల ప్రసాద్ మృతి మిడీయా ప్రపంచానికి తీరని లోటని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కే శ్రీనివాస్​రెడ్డి అన్నారు. చిన్న వయస్సులోనే విశాలాంధ్ర సంపాదకుడిగా పనిచేయడం గొప్పవిషయమని పేర్కొన్నారు. బుధవారం ప్రసాద్ సంస్మరణ సభను తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే), విశాలాంధ్ర బృందం అధ్వర్యంలో బషీర్ బాగ్ లోని దేశోద్దారక భవన్​లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు ఆయన సేవలను గుర్తుకు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి . విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ మాజీ అధ్యక్షులు, ఏపీ ప్రభుత్వ  జాతీయ మీడియా సలహాదారులు దేవులపల్లి అమర్, ఐజేయూ కార్యదర్శి వైనరేందర్ రెడ్డి, విశాలాంధ్ర పత్రిక తెలంగాణ ఇన్​చార్జి రామారావు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.