హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరుగనున్న మూడవ వన్డేలో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. క్యాన్‌బెరాలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. ఇండియా జట్టు తరపున లెఫ్ట్ ఆర్మీ బౌలర్ నటరాజన్ అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సిరీస్‌లో బౌలింగ్‌లో ఎన్నో ప్రయోగాలు చేశామని కెప్టెన్ కోహ్లీ అన్నాడు. భారత జట్టులో ఈ మ్యాచ్ కోసం మార్పులు జరిగాయి. నటరాజన్‌తో పాటు శుభ్‌మన్ గిల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌లు జట్టులోకి వచ్చారు. మయాంక్ అగర్వాల్, నవదీప్ సైనీ, షమీ, చాహల్ ఈ మ్యాచ్‌కు దూరం అయ్యారు. మరో వైపు ఆస్ట్రేలియా జట్టులో ఈ మ్యాచ్ కోసం మూడు మార్పులు చేశారు. ఆస్ట్రేలియా తరపున కమరూన్ గ్రీన్ ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేయనున్నాడు. గ్రీన్‌తో పాటు అబ్బాట్, ఆస్టన్ ఆగర్‌లు ఆసీస్ జట్టులోకి వచ్చారు. తొలి రెండు వన్డేలు నెగ్గిన ఆస్ట్రేలియా .. చాలా దృఢమైన బ్యాటింగ్ లైనప్‌తో బలంగా ఉన్నది. అయితే రెండవ వన్డేలో గాయపడ్డ వార్నర్ ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. మొదటి రెండు వన్డేలు హై స్కోరింగ్ మ్యాచ్‌లు అయిన విషయం తెలిసిందే. రెండు జట్లు ఆ మ్యాచ్‌ల్లో 300 స్కోర్‌ను దాటాయి. అయితే క్యాన్‌బెరా పిచ్‌లో ఆ సీన్ రిపీట్ అవుతుందా లేదా వేచి చూడాల్సిందే.