నేడు నిజామాబాద్‌ జిల్లాకు కేసీఆర్

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నిజామాబాద్‌ జిల్లాకు వెళ్లనున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా తండ్రి కృష్ణమూర్తి ఇటీవల మరణించగా.. మాక్లూర్‌ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే ఇంట్లో నిర్వహించే ద్వాదశ దినకర్మలో సీఎం పాల్గొననున్నారు. ప్రగతిభవన్‌ నుంచి ఉదయం 10.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు రోడ్డుమార్గంలో నిజామాబాద్‌ చేరుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డుమార్గం ద్వారా బయలుదేరి 4.30 గంటలకు ప్రగతిభవన్‌కు చేరుకుంటారు.