బోర్‌వెల్‌ వాహనం, ఇన్నోవా ఢీ: ఆరుగురు మృతి

బోర్‌వెల్‌ వాహనం, ఇన్నోవా ఢీ: ఆరుగురు మృతిరంగారెడ్డి జిల్లా‌: చేవెళ్ల మండలం మల్కాపూర్‌ గేటు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారిపై బోరువెల్‌ వాహనం – ఇన్నోవా కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

బోర్‌వెల్‌ వాహనం, ఇన్నోవా ఢీ: ఆరుగురు మృతి జేసీబీ సహాయం తో కారు లో ఉన్నవారిని వెలికి తీత , వీరంతా హైదరాబాద్ కు చెందిన వారు గా గుర్తించిన పోలీసులు. చేవెళ్ల లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారంతా హైదరాబాద్ నగరంలో ని తడిబండ్ కు చెందిన వారు, ఇన్నోవా కారులో11 మంది ఉండగా ఇందులో6మంది మృతి. ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రాణలతో ఇద్దరు బయట పడ్డారు. కర్ణాటక లో గురుమిట్కల్ కు వెళ్తున్నారు మృతులు ఆసిఫ్ ఖాన్ 50). మహేష్ షనియా(18) నజియ బేగం 45) నజియ భాను( 36) హర్ష (28) హర్ష భాను 6) గా గుర్తించారు.

బోర్‌వెల్‌ వాహనం, ఇన్నోవా ఢీ: ఆరుగురు మృతి