పోలింగ్ బూత్ ల వారిగా వివరాలు

పోలింగ్ బూత్ ల వారిగా వివరాలు

హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల పోలింగ్ దారుణంగా ఉంది. మధ్యాహ్నం రెండు గంటల వరకూ కేవలం 24.52 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా విద్యావంతులు ఎక్కువగా ఉన్న డివిజన్లలో 10 శాతం కూడా పోలింగ్ దాటలేదు. గుడిమల్కార్‌పూర్‌లో అత్యధికంగా 49.19శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా రెయిన్‌బజార్‌లో అరశాతం (.56)శాతం నమోదయ్యింది.

పోలింగ్ శాతం ఇలా..

కొండాపూర్- 9.98%

రాజేంద్రనగర్- 9.90%

విజయనగర్ కాలనీ- 9.0 %

ఆల్విన్‌ కాలనీ- 3.85%

సోమాజిగూడ- 2.77%

అమీర్‌పేట్- 0.79%

ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే డివిజన్లలో..

కొండాపూర్- 9.98%

బంజారాహిల్స్- 21.36%

మాదాపూర్- 13.54 %

జూబ్లీహిల్స్- 12.47%

కూకట్‌పల్లి- 12.37 %

చందానగర్- 31.08%

ఆల్విన్‌కాలనీ- 3.85%

మిగిలిన ప్రాంతాల్లో ఇలా..

హిమాయత్ నగర్- 18.17%

కాచిగూడ – 20.97%

నల్లకుంట-30.62%

గోల్‌నాక -23.47%

అంబర్‌పేట్ -24.94%

బాగ్ అంబర్‌పేట్- 28.00%

మధ్యాహ్నం 3 గంటల వరకు..

నాగోల్ – 35.24 %

మన్సూరాబాద్ – 34.06 %

హాయత్ నగర్ – 35.62 %

బీఎన్ రెడ్డి నగర్ – 34.23 %

మొత్తానికి చూస్తే.. నిజంగా ఇది 400 ఏళ్ల చరిత్రగల భాగ్యనగరానికి సిగ్గుచేటు అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని పోలింగ్ బూతుల్లో ఇప్పటి వరకూ ఓటర్లే రాలేదు. దీంతో చేసేదేమీ లేక పోలింగ్ సిబ్బంది ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. సిటీలో మధ్యాహ్నం దాటినప్పటికీ ఓటేయడానికి జనాలు ఇళ్ల నుంచి బయటి రావట్లేదు కానీ.. నగరు శివారులో మాత్రం ఓటేసేందుకు జనాలు క్యూ కడుతున్నారు. పోలింగ్ ఇలానే జరిగితే మొత్తమ్మీద 50 శాతం కూడా ఓటింగ్ దాటడం కూడా అనుమానమే.!. మరోవైపు.. పోలింగ్ కేంద్రాల వైపు విద్యాధికులు కన్నెత్తి కూడా చూడలేదు. మరోవైపు.. ‘పోలింగ్ డే’ని ‘హాలిడే’గా కార్పొరెట్ ఉద్యోగులు ఎంజాయ్ చేస్తున్నారు. ఓటు వేయకపోవడం బాధ్యతారాహిత్యమే అని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.