రైతులకు అండగా జనసేన దీక్ష

రైతులకు అండగా జనసేన దీక్ష

హైదరాబాద్: తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంతో ప్రభుత్వం విఫలమైందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. బాధిత రైతులకు పరిహారంగా 35వేల రూపాయలు, తక్షణ సాయంగా రూ 10,000 ఇవ్వాలని ఆ‍యన డిమాండ్ చేశారు. తుఫాన్ వల్ల రైతులు నష్టపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో రైతాంగానికి అండగా నిలిచేందుకు పవన్ కళ్యాణ్ నిరసన దీక్ష చేపట్టారు. హైదరాబాదులోని తన నివాసంలో ఉదయం పదిగంటలకు దీక్షను ప్రారంభించారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోకుంటే ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చే కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా వున్నట్లు పవన్ కళ్యాణ్ ఈ దీక్ష ద్వారా హెచ్చరించారు.