వరంగల్ అర్బన్: కేయూ పరిధిలోని ఇంజినీరింగ్ ఫస్టియర్ క్లాస్లు డిసెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆ డిపార్ట్మెంట్ డీన్ ప్రొఫెసర్ శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేయూ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాల ప్రినిపాళ్లతో ఆదివారం సాయంత్రం జరిగిన సమావేశంలో తరగతుల షెడ్యూల్ను వెల్లడించారు. కార్యక్రమంలో కేయూ క్యాంపస్ , కొత్తగూడెం ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాళ్లు మల్లారెడ్డి , డాక్టర్ రమణ , వినూత్న కాలేజీ చైతన్య కాలేజీ, విట్స్ కాలేజీ ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.