కాశీలో ప్ర‌ధాని మోదీ అభిషేక పూజ‌లు

కాశీలో ప్ర‌ధాని మోదీ అభిషేక పూజ‌లుహైద‌రాబాద్‌: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు కాశీ విశ్వ‌నాథుడికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభిషేక పూజ‌లు నిర్వహించారు. త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన వార‌ణాసికి మోదీ వెళ్లారు. అక్క‌డ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న త‌ర్వాత ఆయ‌న కాశీ విశ్వేశ్వ‌రుడికి పూజ‌లు చేశారు. ల‌లితా ఘాట్‌కు ఆయ‌న ప్ర‌త్యేక బోటులో వ‌చ్చారు. ఆ త‌ర్వాత పంచామృతాల‌తో అభిషేకం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కూడా పాల్గొన్నారు.