హైదరాబాద్: మారుతి డైరెక్షన్లో 2012లో వచ్చిన ఈరోజుల్లో, బస్‌స్టాప్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది వరంగల్ బ్యూటీ ఆనంది. తక్కువ బడ్జెట్ సినిమాగా ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ ముద్దుగమ్మ సినిమాలు బాక్సాపీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. నటిగా ఈ అమ్మడుకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. వరుసగా అవకాశాలు వచ్చినా ఆనంది మాత్రం తమిళ చిత్రాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. కొన్నాళ్లుగా తమిళ ప్రేక్షకులను ఆలరిస్తున్న ఈ బ్యూటీ ఎనమిదేళ్ల విశ్రాంతి తరువాత మళ్లీ తెలుగు ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం జాంబిరెడ్డి చిత్రంలో నటిస్తోంది ఈ భామ. పలాస ఫేం కరుణకుమార్ డైరెక్షన్లో సుధీర్‌బాబు సోడా సెంటర్ సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది. ఈచిత్రాన్ని విజయ్ ఛిల్లా శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.