జనగామలో విషాదం

జనగామలో విషాదంజనగామ జిల్లా : జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వరంగల్​ అర్బన్​ జిల్లా మామునూర్​ పోలీస్​స్టేషన్​ పరిథిలోని నక్కలపెల్లి గ్రామంలో శుక్రవారం ఓ ప్రేమ జంట వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. నిన్న జరిగిన ఈ ఘటన మరువకముందే శనివారం జనగామ జిల్లాలో మరో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు ప్రేమికులు పాలకుర్తిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు లక్ష్మీ(17), అంజయ్య(18)లుగా గుర్తించినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.