పాడి రైతుల అభివృద్ధికి అండ

పాడి రైతుల అభివృద్ధికి అండసూర్యాపేట జిల్లా : పాడి రైతుల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జిల్లాలోని మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఇతర ఉన్నతాధికారులతో కలసి ఆయన పలు కార్యక్రమాలను ప్రారంభించారు.‘ సీఎం కేసీఆర్​ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో పాడి సంపదను గణనీయంగా పెంచామని ఆదిశగా పాడి రైతులు ఆర్థికంగా బలపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అన్ని జిల్లాలో పశు వైద్య శాలలో అన్ని రకాల మందులు ఉంచామని, గ్రామాల్లో సంచార పశు వైద్యం గణనీయంగా పెంచామని పేర్కొన్నారు. 1962 నంబర్ కి కాల్​ చేస్తే ఇంటివద్దకే వచ్చి ఉచితంగా వైద్యమందించడం జరుగుతుందని తెలిపారు. గోపాల మిత్ర సభ్యులకు ఇకపై ప్రతి నెల వేతనాలు అందిస్తామన్నారు. ఈ గ్రామంలో పశు వైద్యశాలకు కాంపౌండ్ గోడ మంజూరు చేస్తున్నామని మంత్రి తలసాని తెలిపారు. రైతులకు రైతు బంధు, రైతు భీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. గత పాలకుల వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. జిల్లాలో ఆవు, గేదె జాతి పశువులు 2,39,728 అలాగే గొర్రెలు, మేకలు 6,53,217 ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సంచార వైద్యం ద్వారా 14,583 పశువులకు అత్యవసర సేవలు అందించినట్లు తెలిపారు. నోరులేని పశువులకు పశుసంవర్ధక శాఖ తల్లిలా సేవలందిస్తోందన్నారు.

పాడి రైతుల అభివృద్ధికి అండగొర్రెల, పశువుల పాక ల ఏర్పాటుకు జిల్లాలో పాడి రైతులు ముందుకు రావాలని అన్నారు. వైద్య శాలలో పశువులకు నట్టల నివారణ మందులు వేసిన అనంతరం ఏర్పాటు చేసిన లేగ దూడల, గొర్రెల, పశు మందుల స్టాల్ లను ప్రజా ప్రతి నిధులతో అధికారులతో కలసి మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ అనితా రాజేంద్ర, సీఈవో డాక్టర్​ మంజుల వాణి, సంచాలకులు లక్ష్మా రెడ్డి , కలెక్టర్ టీ వినయ్ కృష్ణా రెడ్డి, ఆర్డీవో కిషోర్ కుమార్, జేడీ వేణు మనోహర్ పాడి రైతులు, గోపాల మిత్ర సభ్యులు పాల్గొన్నారు.