నల్లమల లఘు చిత్రం షురూ..

నల్లమల లఘు చిత్రం షురూ..నాగర్​కర్నూలు జిల్లా : జిల్లాలోని పర్యాటక ప్రదేశాలకు సంబంధించి అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నల్లమల లఘుచిత్రాన్ని శనివారం నాగర్​కర్నూల్​ కేసరి సముద్రం ట్యాంకుబండ్​పై కెమెరా స్విచ్​ ఆన్​ చేసి కలెక్టర్​ శర్మన్​ ప్రారంభించారు. జిల్లాలోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను ప్రజలకు చేరువ చేసేలా లఘుచిత్రాన్ని చిత్రీకరించాలని దర్శకుడికి కలెక్టర్​ సూచించారు. జిల్లాలోని సుందరమైన ప్రదేశాలను పర్యాటకులు సందర్శించే విధంగా షూటింగ్​ జరుపాలని కోరారు.