ఆర్‌ఆర్‌ఆర్‌’లో మెగాస్టార్‌..?

ఆర్‌ఆర్‌ఆర్‌’లో మెగాస్టార్‌..?హైదరాబాద్‌: ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ గురించి ప్రస్తుతం నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి సైతం భాగం కానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ఈ సినిమాలో వెండితెరపై కనిపించకుండానే ప్రేక్షకులను మెప్పించనున్నట్లు సమాచారం.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (తెలుగు) చిత్రంలోని రామ్‌చరరణ్‌, ఎన్టీఆర్‌ పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నారట. ఈ మేరకు రాజమౌళి అడగ్గానే చిరు కూడా ఓకే చెప్పేశారని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. సదరు వార్తలు విని సినీ ప్రియులు ఎంతో సంతోషిస్తున్నారు. పాన్‌ ఇండియన్‌ స్థాయిలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హిందీ వెర్షన్‌కి ఆమిర్‌ఖాన్‌ వాయిస్‌ఓవర్‌ అందించనున్నారట. అలాగే మిగిలిన దక్షిణాది బాషలకు సంబంధించి ఆయా ఇండస్ట్రీలకు చెందిన ఓ స్టార్‌ హీరో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి గాత్రం ఇవ్వనున్నట్లు సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్న ఈ సినిమాలో బాలీవుడ్‌, హాలీవుడ్‌కు చెందిన పలువురు తారలు నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ సరసన బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌, ఎన్టీఆర్‌కు హీరోయిన్‌గా ఒలీవియా మోరీస్‌ స్ర్కీన్‌పై సందడి చేయనున్నారు. అలాగే బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌, నటి శ్రియ, హాలీవుడ్‌కు చెందిన ఎలిసన్‌ డ్యూడీ, రే స్టీవ్‌సన్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతు దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు