విమాన సర్వీసుల రద్దు పొడిగింపు

విమాన సర్వీసుల రద్దు పొడిగింపుఢిల్లీ : కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల నిషేధాన్ని డిసెంబర్ 31వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే సరకు రవాణాసేవలు, అనుమతి పొందిన విమానాలకు అంతరాయం ఉండదని పేర్కొంది. అవి పర్మిషన్ ఉన్న మార్గాల్లో మాత్రమే నడుస్తాయని డీజీసీఏ తెలిపింది. మార్చి 23 నుంచి కేంద్రం అన్ని అంతర్జాతీయ విమాన ప్రయాణ సేవలను నిలిపివేసింది. ఈ నిషేధం నవంబర్ 30 తో ముగియనుండగా డీజీసీఏ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.