తెలంగాణలో పులి హల్ చల్

కొమురంభీం జిల్లా: పెంచికల్ పేట మండలంలో పెద్దపులి హల్ చల్ చేస్తోంది. అగర్ గూడ, గుండెపల్లి అటవీ ప్రాంతంలో పులి తిరుగుతోంది..స్థానిక పెద్దవాగు దాటుతున్న పులి గ్రామస్తుల కంటబడింది. వాగులో దర్జాగా నడుచుకుంటూ వచ్చింది. రేగిచెట్టు మడుగువద్ద నీళ్లు తాగిన పులి అగర్ గూడ అడవి ప్రాంతంలోకి వెళ్లిపోయింది. గంగాధర్ అనే యువకుడు పులి కదలికలను తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో అధికారులు అక్కడికి చేరుకుని గ్రామస్తులను అప్రమత్తం చేశారు.