మహిళా ఖైదీలు విడుదల

మహిళా ఖైదీలు విడుదలరాజమండ్రి: యావజ్జీవ శిక్ష పడిన మహిళా ఖైదీలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 53 మంది మహిళా ఖైదీల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాజమండ్రి జైలు నుండి 19 మంది, కడప నుండి 27 మంది, నెల్లూరు జైలు నుండి ఐదుగురు, విశాఖ నుంచి ఇద్దరు విడుదల చేసింది. రూ. 50 వేల పూచీకత్తు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. 3 నెలలకోసారి పోలీస్‌ స్టేషన్‌లో హాజరుకావాలని ప్రభుత్వం సూచించింది.