పోలీస్ అమరవీరుల త్యాగాలను మరువద్దు: వరంగల్ సిపి

పోలీస్ అమరవీరుల త్యాగాలను మరువద్దు: వరంగల్ సిపిజనగాం జిల్లా: వరంగల్ – హైదరాబాదు ప్రధాన రోడ్దు మార్గంలోని రఘునాధ్ పల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నెలకొల్పబడిన పోలీసు అమరవీరుల శాంతి స్థూపాన్ని శుక్రవారం పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీసులు చేసిన ప్రాణత్యాగాలతో ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి నెలకొల్పబడిందని అన్నారు. ప్రజలు పోలీస్ అమరవీరుల త్యాగాలను ఎన్నడు మరువద్దని అన్నారు. మరియు పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా వుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ డి.సి.పి శ్రీనివాస్ రెడ్ది, ఘన్ పూర్ ఇంచార్జ్ ఎ.సి.పి వినోద్ కుమార్, జనగాం రూరల్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ బాలాజీ వర ప్రసాద్,రఘునాధ్ పల్లి ఎస్ .ఐ అశోక్ కుమార్, లింగాల ఘన్ పూర్ ఎస్.ఐ రమేష్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు పంజాల అశోక్ కుమార్ గౌడ్ తో ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.