నేడు సీఎం జగన్‌తో మెగాస్టార్ భేటీ

నేడు సీఎం జగన్‌తో మెగాస్టార్ భేటీహైదరాబాద్ : తాను ఇండస్ట్రీకి పెద్దగా ఉండనని, పంచాయితీలు చేయనని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. దిక్కూ, మొక్కూ మెగాస్టారే అనుకుంటున్న వేళ.. చిరు చేసిన ఈ కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. అయితే చిరు మాత్రం సైలెంట్ గా ఇండస్ట్రీ సమస్యలపై ఫోకస్ పెట్టారు.

ఈ క్రమంలో నేడు (గురువారం) ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కలిసేందుకు చిరుకు.. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ఇరువురు కలిసి లంచ్‌ చేయనున్నారు. ఈ క్రమంలో పలు కీలక విషయాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం, టాలీవుడ్ మధ్య బాహాటంగానే వార్ నడుస్తోంది. అటువైపు నుంచి, ఇటువైపు నుంచి మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ టికెట్ రేట్ల తగ్గింపుపై పలువురు హీరోలు, నిర్మాతలు.. చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల గురించి చిరు.. సీఎంతో చర్చించే అవకాశం ఉంది.

మాటల కౌంటర్స్ వల్ల గ్యాప్ పెరిగిపోతుందని.. ఇది రెండువైపులా డ్యామేజ్ జరిగే అంశం అని మెగాస్టార్ పరిస్థితి వివరించనున్నారట. తెలుగు ఇండస్ట్రీపై పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఈ సందర్భంగా సీఎం జగన్‌కు దృష్టి చిరంజీవి తీసుకెళ్లే అవకాశం ఉంది.