ఐనవోలు మల్లన్న సన్నిధిలో మంత్రి ఎర్రబెల్లి

ఐనవోలు మల్లన్న సన్నిధిలో మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ జిల్లా : ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలు విముక్తి పొంది పాడిపంటలతో సంతోషంగా జీవించాలని కోరుకున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

స్వామి వారి సన్నిధికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందచేశారు. అనంతరం ఐనవోలు ఆలయ అభివృద్ధిపై అధికారులతో మంత్రి సమీక్షించారు. మంత్రి వెంట వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు తదితరులు ఉన్నారు.