ఢిల్లీ బయల్దేరిన మంత్రి ఎర్రబెల్లి బృందం

ఢిల్లీ బయల్దేరిన మంత్రి ఎర్రబెల్లి బృందం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఢిల్లీలో జరిగే మహాధర్నాలో పాల్గొనేందుకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, టీవీసీసీ చైర్మన్ వాసుదేవరెడ్డి, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, ఉమ్మడి ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీకి బయల్దేరారు.ఢిల్లీ బయల్దేరిన మంత్రి ఎర్రబెల్లి బృందంవరిధాన్యం కొనుగోలు చేసేదాకా కేంద్రాన్ని వదిలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతులకు అన్యాయం చేయడానికి చూస్తే ఎవరిని వదలమని, రైతన్న కోసం ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఉద్యమాలు చేశామని, రైతు బాగు కోసం పల్లె నుంచి ఢిల్లీకి వెళ్తున్నామన్నారు. రేపటి ధర్నాతోనైనా కేంద్రం దిగివస్తుందని ఆశిస్తున్నామన్నారు.