ఏపీలో ఖరారైన కొత్త మంత్రుల పేర్లు 

ఏపీలో ఖరారైన కొత్త మంత్రుల పేర్లు

వరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీలో కొత్త మంత్రివర్గం జాబితా విడుదలైనట్లు సమాచారం. నేడు ఉదయం నుంచి అనేక ఊహాగానాల మధ్య తుది జాబితాను ప్రకటించినట్లు తెలిసింది. కొత్త, పాత మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మాన ప్రసాద్ రావు, సిదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్న దొర, గుడివాడ అమర్ నాథ్, బూడి ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజా, పినిపె విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాల్, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావును నియమించినట్లు సమాచారం.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, కొట్టు సత్యనారాయణ, జోగి రమేశ్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, నారాయణ స్వామి, ఉషా శ్రీ చరణ్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంజాద్ బాష, తిప్పెస్వామి, విడదల రజని మంత్రులుగా నియమించినట్లు సమాచారం.