చక్రి ఆరవ వర్ధంతి వేడుకలు

చక్రి ఆరవ వర్ధంతి వేడుకలుహైదరాబాద్ : సంగీత దర్శకుడు చక్రి ఆరవ వర్ధంతి వేడుకలు మంగళవారం కొత్తపేట లోని అందరి ఇళ్లులో చక్రి తమ్ముడు మహిత్ నారాయణ ఆధ్వర్యంలోనిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చక్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ‘ఈ రోజు అందరి ఇళ్లు చక్రి ఇళ్లుగా మారిందని, ఆయన 6వ వర్ధంతి ఇక్కడ నిర్వహించడం సంతృప్తినిచ్చిందని అందరి ఇళ్లు నిర్వాహకులు డాక్టర్​ సూర్య ప్రకాష్, కామేశ్వరి’అన్నారు. ‘నాన్న వెంకట్ నారాయణ, అన్నయ్య చక్రి ఆశయ సాధనకు కృషి చేస్తానని చక్రి తమ్ముడు, సంగీత దర్శకుడు మహిత్ నారాయణ’తెలిపారు. సంగీత సామ్రాజ్యంలో చక్రి సుస్థిర స్థానాన్ని నిర్మించారని, చక్రి పేరు చిరస్థాయిగా నిలిచి పోయేలా అన్నయ్య పేరుతో సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ‘మహబూబ్బాద్ లో చక్రి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని మహబూబా బాద్ కాపు సంఘం అధ్యక్షుడు , టీఆర్ ఎస్ నాయకులు డాక్టర్​ కొండ దేవన్న అన్నారు. ఈ కార్యక్రమంలో చక్రి సన్నిహితులు జె కె మధు, శశిధర్ రెడ్డి ,ప్రభాకర్, రాజు, నిశాంత్, యశ్వంత్, మల్లేష్,సందీప్,సాగర్,బంధువులు వలసాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.