న్యూఇయర్​ వేడుకలు రద్దు

అమరావతి : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో డిసెంబర్ 31, జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలను రద్దు చేసింది. ఈ రెండు రోజుల్లో రాష్ట్రం మొత్తం కర్ఫ్యూ ఉంటుంది. కరోనా సెకండ్ వేవ్ గురించి కేంద్ర వైద్య నిపుణుల సూచనల నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం విధించారు. ఈ నెల 26 నుంచి జనవరి 1 వరకూ అన్ని రకాల వేడుకలు రద్దు చేస్తారు. వైన్స్​, బార్ల సమయాన్ని కుదిస్తారు. విద్యా సంస్థలకు కొన్ని సూచనలు ఇస్తారు.