చంటి అడ్డాలపై ఫైర్ అయిన నిర్మాత న‌ట్టికుమార్

చంటి అడ్డాలపై ఫైర్ అయిన నిర్మాత న‌ట్టికుమార్

హైదరాబాద్: నవీన్‌ విజయ్‌ కృష్ణ, కీర్తీ సురేష్‌ జంటగా నటించిన చిత్రం ‘ఐనా ఇష్టం నువ్వు’. దర్శకుడు కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్‌ రౌత్‌ దర్శకుడు. ఇటీవల ఈ చిత్రాన్ని టైటిల్‌ మార్చి విడుదల చేయనున్నట్లు నిర్మాత చంటి అడ్డాల తెలిపిన విష‌యం తెలిసిందే. ఈ వివాదంపై నిర్మాత న‌ట్టికుమార్ మాట్లాడుతూ – ఐనా ఇష్టం నువ్వు సినిమాని చంటి అడ్డాల మాకు అమ్మినట్టు సాక్ష్యాలున్నాయి. అయినా ఎక్కువ డబ్బు కోసం ఆయన మమ్మల్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. ఈ విష‌య‌మై మేము కోర్టుని ఆశ్రయించి కోర్టు ద్వారా సినిమా విడుద‌ల‌పై స్టే ఆర్డ‌ర్ తీసుకురావ‌డం జ‌రిగింది. ఈ క్ర‌మంలో కొంత మంది పోలీసుల నుండి మాకు బెదిరింపులు వ‌స్తున్నాయి. ‌మ‌రోసారి ఇలా జ‌రిగిన యెడ‌ల వారిపై కూడా చ‌ట్ట‌రిత్యా కేసు పెట్ట‌డం జ‌రుగుతుంది అని తెలిపారు.