కివీస్ చేతిలో ఓడిన విండీస్​

కివీస్ చేతిలో ఓడిన విండీస్​హామిల్టన్​: వెస్టిండీస్​తో జరిగిన తొలి టెస్ట్​లో ఇన్నింగ్స్​ 134 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్​ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్​, బౌలింగ్​లో అదరగొట్టి మ్యాచ్​ను ఏక పక్షంగా ముగించింది. తొలి ఇన్నింగ్స్​లో 519 పరుగుల భారీ స్కోర్​ చేసిన న్యూజిలాండ్​ ఆ తర్వాత వెస్టిండీస్​ను రెండు ఇన్నింగ్స్​ల్లోనూ తక్కువ స్కోర్లకే అలౌట్​ చేసి విజయాన్ని సాధించింది. తొలి ఇన్నింగ్స్​లో 138 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్​ రెండో ఇన్నింగ్స్​లోనూ కేవలం 247 పరుగులకే మ్యాచ్​ను ముగించింది. జోసెఫ్​ (86)తో కలిసి ఏడో వికెట్​కు 155 పరుగులు చేశాడు బ్లాక్​వుడ్​. వీరు ఇద్దరు తప్పా మిగిలిన బ్యాట్స్​మెన్స్​ అంతా విఫలకావడంతో విండీస్​ భారీ ఓటమి చవిచూసింది.