అంబేద్కర్​ కు ఘన నివాళి

అంబేద్కర్​ కు ఘన నివాళిహైదరాబాద్: అంబేద్కర్​ 64వ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలో అంబేద్కర్​ విగ్రహానికి స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి ఆదివారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే ఆయనతో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , ప్రభుత్వవిప్ గొంగిడి సునీత, పలువురు ఎమ్మెల్యేలు, లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహా చార్యులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

అంబేద్కర్​ జీవితం దేశ ప్రజలకు స్ఫూర్తి : సీఎం కేసీఆర్

అంబేద్కర్​ జీవితం దేశ ప్రజలకు స్ఫూరినిస్తుందని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ వర్ధంతి సందర్భంగా ఆదివారం అంబేద్కర్​చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్​ దేశానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు. అంబేద్కర్​ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.