బంద్​కు మా సంపూర్ణ మద్దతు

బంద్​కు మా సంపూర్ణ మద్దతుహైదరాబాద్​: దేశవ్యాప్తంగా డిసెంబర్ 8వ తేదీన నిర్వహించనున్న భారత్​ బంద్ కు తెలంగాణ వికాస సమితి సంపూర్ణ మద్దతు తెలిపింది. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వచ్చిన చట్టాలని రద్దు చేసి రైతులకు మద్దతు ధర కొనసాగే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సమితి నాయకులు డిమాండ్​ చేశారు. కేంద్ర ప్రభుత్వం తో ఐదు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు. కావున గత్యంతరం లేని పరిస్థితుల్లో భారత్ బంద్ కు పిలుపు ఇచ్చిన రైతుల ఆవేదనను ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. భారత్ బంద్ ను విజయవంతానికి అందరూ స్వచ్ఛందంగా కలిసి రావాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర కార్యవర్గంలో ని బాధ్యులు సమావేశమై భారత్ బంద్ కు మద్దతు తెలపాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమన్వయ కర్త నరసింహారెడ్డి, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు , డాక్టర్ జయంతి, హెచ్ రవీందర్, విజయానంద్, పులి రాజు, భిక్షపతి నాయక్, పిండిగా వెంకన్న పాల్గొన్నారు.