భారత్​ జోరు కొనసాగేనా..?

భారత్​ జోరు కొనసాగేనా..?సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో విజయం ద్వారా ఫామ్​లోకి వచ్చిన టీమిండియా తొలి టీ20లో తన ప్రతాపం చూపింది. అయితే మూడు టీ20 సిరీస్​లో భాగంగా సిడ్నీ వేదికగా రెండో మ్యాచ్​ ఆదివారం మధ్యాహ్నం ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్​లో విజయం సాధించి సిరీస్​ను తన ఖాతాలో వేసుకోవాలని పట్టుదలతో ఉంది. కాగా కోహ్లీసేనపై పైచేయి సాధించి రేసులో నిలవాలని ఆసీస్​ భావిస్తోంది. అయితే ఈ రెండు జట్లమధ్య జరిగే ఉత్కంఠ పోరులో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి. ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది టీమిండియా. ఆరోన్ ఫించ్ లేక‌పోవ‌డంతో ఆస్ట్రేలియాకు మాథ్యూ వేడ్ వ్వవహరిస్తున్నాడు.

జట్టువివరాలు:
భారత్​: ధావన్​ ,కేఎల్​రాహూల్​, విరాట్​కోహ్లీ(కెప్టెన్​), సంజుశాంసన్​, శ్రేయస్​ అయ్యర్​, హార్దిక్​ పాండ్య, సుందర్​, దీపక్​ చాహర్​, నటరాజన్​, చాహల్​ ,శార్ధూల్​

ఆస్ట్రేలియా: షార్ట్​, స్టాయినిస్​, స్టీవ్​స్మిత్​, హెన్రిక్స్​, గ్లెన్​మాక్స్​వెల్​, మాథ్యూవేడ్​(కెప్టెన్​), డేనియల్​ సామ్స్​, అబాట్​, ఆండ్రూటై. స్వెప్సన్​, జంపా