కానీ నిజమైన హీరో సీఎం జగన్ : నిక్! 

కానీ నిజమైన హీరో సీఎం జగన్ : నిక్!

కానీ నిజమైన హీరో సీఎం జగన్ : నిక్! 

వరంగల్ టైమ్స్, అమరావతి : ప్రపంచం మొత్తానికి నేను హీరో కావచ్చు..కానీ నా దృష్టిలో నిజమైన హీరో ఏపీ సీఎం జగన్ అని అంతర్జాతీయ మోటివేషన్ స్పీకర్ నిక్ వుజిసిక్ కొనియాడారు. నిక్ ఏపీ సీఎం జగన్ ను నేడు కలుసుకున్నారు. విద్యారంగంలో మార్పుల కోసం జగన్ పని చేస్తున్నారని నిక్ అభినందించారు. సీఎం జగన్ ను కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు నిక్.

“నేను దాదాపు 78 దేశాల్లో పర్యటించాను, కానీ ఇలాంటి సీఎంను ఎప్పుడూ కలుసుకోలేదు. ఇక్కడి సీఎం చాలా ముందుచూపుతో సంస్కరణలు చేపడుతున్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో సంస్కరణలు తీసుకువస్తున్నారు. సీఎం చాలా డైనమిక్ గా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 45 వేల ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్ల తరహాలో డెవలప్ చేశారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ప్రపంచం మొత్తం తెలియాలి. సీఎం జగన్ ను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. 10వ తరగతిలో నా లైఫ్ ను పాఠంగా పెట్టారు. అది చూసి ఎంతో సంతోషించాను. అది నాకు చాలా ప్రోత్సాహకంగా ఉంది. ఇక్కడ విద్యారంగంలో నా వంతు చేయాలనుకుంటున్నాను. ఇక్కడ స్కూళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఏ స్కూల్ కు వెళ్లిన సీఎం పేరు మారుమోగిపోతుంది. వరల్డ్ క్లాస్ విద్యను ఇక్కడి స్కూళ్లలో అందిస్తున్నారు” అంటూ నిక్ వుజిసిక్ సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

నికోలస్ జేమ్స్ వుజిసిక్ ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గుర్తింపు ఉన్న మోటివేషనల్ స్పీకర్. నికోలస్ జేమ్స్ వుజిసిక్ ఎంతో మందికి ఆదర్శం అని ఏపీ సీఎం జగన్ అన్నారు. అలాంటి వ్యక్తి ఏపీ పర్యటనకు రావడం గర్వించదగిన విషయమని జగన్ పేర్కొన్నారు.