అలర్ట్..కేవీఎస్ అడ్మిట్ కార్డులు రిలీజ్ 

అలర్ట్..కేవీఎస్ అడ్మిట్ కార్డులు రిలీజ్

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంగఠన్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తారు. టీజీటీ, పీజీటీ, పీఆర్టీ వంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తారు. కేవీఎస్ లో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూల్ ను చెక్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌ను kvsangathan.nic.in చెక్ చేయండి. ఫిబ్రవరి 7న ఈ రిక్రూట్ మెంట్ పరీక్ష ప్రారంభం అవుతుంది. మార్చి 6 వరకు కొనసాగుతుంది. ఫిబ్రవరి 7న అసిస్టెంట్ కమీషనర్ పోస్టుకు పరీక్ష జరగనుంది. ఫిబ్రవరి 08న ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి పరీక్ష జరగనుంది. ఫిబ్రవరి 09న వైస్ ప్రిన్సిపాల్ పీఆర్టీ పోస్టులకు పరీక్ష ఉంటుంది.

అయితే ఈ మూడు కేటగిరీలకు సంబంధించి తాజాగా అధికారులు ఓ వెబ్ నోట్ రిలీజ్ చేశారు. వీటికి దరఖాస్తుల చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి పరీక్ష సెంటర్ ను తెలుసుకునేందుకు లింక్ యాక్టివేట్ చేశారు. ఈ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరుగుతుంది. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, అసిస్టెంట్ కమీషనర్ పోస్టులకు దరఖాస్తు చేసకున్న అభ్యర్థులు ఈ లింక్ ద్వారా పరీక్షసెంటర్ ను తెలుసుకునే సదుపాయం ఉంటుంది. అయితే అడ్మిట్ కార్డులను మాత్రం పరీక్షకు రెండు రోజుల ముందు వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

ఖాళీల వివరాలు :
ప్రిన్సిపల్-239 పోస్టులు, వైస్ ప్రిన్సిపాల్-203 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్-1409 పోస్టులు, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్-3176 పోస్టులు, ప్రైమరీ టీచర్-6414, లైబ్రేరియన్-355 పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్-52 పోస్టులు, పీఆర్‌టీ-303 పోస్టులు, ఫైనాన్స్ ఆఫీసర్-06 పోస్టులు, అసిస్టెంట్ ఇంజినీర్-02 పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-156 పోస్టులు, హిందీ ట్రాన్స్‌లేటర్‌-11 పోస్టులు, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్-322 పోస్టులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్-702 పోస్టులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2-54 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హత :
పోస్టును బట్టి అర్హత ఉంటుంది.పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ, బీఈడీ, బీపీఈడీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్-2 క్వాలిఫై అయి ఉండాలి. పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 40 ఏళ్లకు మించకూడదు. లైబ్రేరియన్‌ పోస్టులకు 35సంవత్సరాలు, పీఆర్టీ పోస్టులకు 30 ఏళ్లు మించి ఉండకూడదు.