ట్విటర్ లో ఫేక్ వార్తలకు ఇక నో ఛాన్స్

ట్విటర్ లో ఫేక్ వార్తలకు ఇక నో ఛాన్స్ హైదరాబాద్‌: సోషల్ మీడియా ద్వారా మనకు ఎంతో ముఖ్యమైన సమాచారం క్షణాలలో తెలిసిపోతుంది. సోషల్ మీడియాలో వచ్చే ఈ సమాచారం ద్వారా మనకు జరిగే మేలు ఎంతో, అంతే మొత్తంలో నష్టం కూడా జరుగుతుంది. అందుకోసమే, సోషల్ మీడియాలో వచ్చే అసత్య వార్తల ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు ఆయా కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దీని కోసం ఫేస్‌బుక్‌ వార్నింగ్ లేబుల్ తీసుకొస్తుంటే.. ట్విటర్ కూడా ఇదే తరహాలో డిస్‌ప్యూటెడ్ ట్వీట్‌(వివాదాస్పదమైన ట్వీట్) పేరుతో ఒక హెచ్చరికను జారీ చేస్తుంది. దీని ద్వారా మనం ఎక్కువ శాతం అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. కానీ వీటి గురుంచి చాలా మందికి తెలియక పోవడం వల్ల వాటిని తిరిగి పోస్ట్ చేయడం లేదా రీట్వీట్ చేస్తుంటారు. ఇది సోషల్ మీడియా కంపెనీలకు తల నొప్పిగా మారింది. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా ట్విటర్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.