ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కు బ్రేక్

హైదరాబాద్‌ : ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభం కావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నెల 23 నుండి ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తగినట్లుగా అధికార యంత్రాంగం కసరత్తులు కూడా చేస్తున్నది. అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అనుసరించాల్సిన పద్ధతులపై హైకోర్టులో కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. రిజిస్ట్రేషన పై స్టే విధించింది. ఈ అంశాన్ని ఈ నెల 23న హైకోర్టు మరో సారి విచారించనుంది. హైకోర్టు నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే తప్ప రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశం లేదు. ఈ కారణాల వల్ల 23 నుండి ప్రారంభం కావాల్సిన రిజిస్ట్రేషన్లు మరో మూడు నాలుగు రోజులు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.