ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్‌లో పాఠాలు

ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్‌లో పాఠాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి అన్ని పాఠశాలల్లో ఆన్‌లైన్‌లో పాఠాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నెల 17 నుంచి జూనియర్‌ కాలేజీల్లో కూడా డిజిటల్‌ పాఠాలు బోధించనున్నారు. టీశాట్‌- దూరదర్శన్‌ వంటి చానళ్లు, ఎస్సీఈఆర్‌టీ యూ ట్యూబ్‌ వంటి మాధ్యమాల ద్వారా డిజిటల్‌ పాఠాలను ప్రసారం చేయనున్నారు. ఆన్‌లైన్‌లో బోధన, కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం అధికారులతో చర్చించినట్లు తెలిసింది. సెప్టెంబర్‌ ఒకటి తర్వాత జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్లు చేపట్టే అవకాశాలను కూడా విద్యామంత్రి పరిశీలించారు. తొలుత 6 నుంచి 10వ తరగతులకు, సెప్టెంబర్‌ నుంచి 3 నుంచి 5వ తరగతులకు డిజిటల్‌ పాఠాలను బోధించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17 నుంచి ఉపాధ్యాయులు 50% మంది విధులకు హాజరు కావాల్సి ఉన్నది.