ఈనెల 15న సందడి చేయనున్న ‘పెళ్లిసంద‌D’..

ఈనెల 15న సందడి చేయనున్న ‘పెళ్లిసంద‌D’..హైదరాబాద్ : ద‌ర్శ‌కేంద్రుడు కే. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’.ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల రూప‌క‌ల్ప‌న‌లో త‌న మేజిక్‌ను చూపిన ఈయ‌న ‘పెళ్లిసంద‌D’లో న‌టుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో రాఘ‌వేంద్ర‌రావు అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

మూవీని ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబర్ 15న విడుద‌ల చేస్తున్నారు.

ద‌ర్శ‌కేంద్రుడు తెర‌కెక్కించిన నాటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ ‘పెళ్లిసంద‌డి’లో శ్రీ‌కాంత్ హీరో అయితే నేడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ పర్య‌వేక్ష‌ణ‌లో గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్న ‘పెళ్లిసంద‌D’లో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరో అవ‌డం విశేషం. శ్రీలీల హీరోయిన్‌. ‘‘సినిమా ప్ర‌మోష‌న్స్‌ను ప్లానింగ్ ప్ర‌కారం చేసుకుంటూ రావ‌డం వ‌ల్ల సినిమా అంద‌రికీ రీచ్ అయ్యింది.

ఈ సినిమా నుంచి విడుద‌లైన రాఘవేంద్ర‌రావు ప్రోమో, హీరో, హీరోయిన్ ప్రోమోలు, సాంగ్స్, టీజర్, రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను కూడా పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఈ క్యూట్ అండ్ బ్యూటీఫుల్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ద‌స‌రా సంద‌ర్భంగా ఈ అక్టోబర్ 15న విడుద‌ల చేస్తున్నాం’’అని చిత్ర యూనిట్ తెలిపింది.

నటీనటులు : రోష‌న్, శ్రీ‌లీల, ప్ర‌కాశ్‌రాజ్‌, రాజేంద్రప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, స‌త్యంరాజేష్‌, రాజీవ్ క‌నకాల‌, శ్రీ‌నివాస్ రెడ్డి, శక‌లక శంక‌ర్‌, అన్న‌పూర్ణ‌, జాన్సి, ప్ర‌గ‌తి, హేమ‌, కౌముది, భ‌ద్రం, కిరీటి త‌దిత‌రులు..

సాంకేతిక వ‌ర్గం :
సంగీతం : ఎం.ఎం.కీర‌వాణి
సాహిత్యం : శివ‌శ‌క్తి ద‌త్త‌, చంద్ర‌బోస్
సినిమాటోగ్ర‌ఫి : సునీల్ కుమార్ నామ
ఎడిట‌ర్‌ : త‌మ్మిరాజు
ఆర్ట్‌ : కిర‌ణ్ కుమార్ మ‌న్నె,
‌మాట‌లు : శ్రీ‌ధ‌ర్ సీపాన‌
ఫైట్స్‌ : వెంక‌ట్
కొరియోగ్ర‌ఫి : శేఖ‌ర్ వీజే
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌ : వి. మోహ‌న్ రావు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌ : సాయిబాబా కోవెల‌మూడి
స‌మ‌ర్ప‌ణ‌ : కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌
నిర్మాత‌లు : మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని
ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌ : కె. రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ
ద‌ర్శ‌క‌త్వం : గౌరీ రోణంకి