నూతన వ్యవసాయ చట్టాలపై మోడీ సంచలన నిర్ణయం

నూతన వ్యవసాయ చట్టాలపై మోడీ సంచలన నిర్ణయంఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రప్రభుత్వం వెనక్కి తగ్గింది. గత 15 నెలలుగా రైతులు చేస్తున్న ఆందోళనతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగివచ్చింది. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

శీతాకాల సమావేశాల్లోనే బిల్లును వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. ఆందోళన చేస్తున్న రైతులను ఆందోళనలు విరమించుకోవాలని ప్రధాని కోరారు. గురునానక్ జయంతి సందర్భంగా ఎవరి ఇళ్లకు వారు చేరాలని ప్రధాని మోడీ బాధిత రైతులను విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‍లో ఇటువంటి అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు కమిటీ వేస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు.