తిరుమల ఘాట్ రోడ్లు మూసివేత

తిరుమల ఘాట్ రోడ్లు మూసివేతతిరుమల : తిరుమలలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మాడ వీధులన్ని చెరువులను తలపిస్తున్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందస్తు జాగ్రత్తగా శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి తిరుమల ఘాట్ రోడ్లను అధికారులు మూసేశారు.

భక్తుల భద్రత దృష్ట్యా ఘాట్ రోడ్లను మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఘాట్ రోడ్లపై చెట్లు, కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఘాట్ రోడ్లపైకి ఎప్పుడు అనుమతిస్తామనేది తర్వాత ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.