నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి

నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ మధుసూదనాచారిహైదరాబాద్ : నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ మధుసూదనాచారిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నియమించారు. మధుసూదనాచారి పేరును సూచిస్తూ తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలిపారు. కొన్ని రోజుల క్రితం కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కు ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

అయితే ఇటీవల కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్ణయించడంతో మొదట చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ క్రమంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్ పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా మధుసూదనాచారి పేరును సూచిస్తూ ప్రభుత్వం ప్రతిపాదన పంపడంతో ఆయన నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు.