ఫేక్ న్యూస్ వైరల్ చేసిన నలుగురి అరెస్ట్

ఫేక్ న్యూస్ వైరల్ చేసిన నలుగురి అరెస్ట్కమలాపూర్: సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్‌ సీపీ తరుణ్ జోషి కేసు వివరాలు వెల్లడించారు.

గత నెల 29న కమలాపూర్తో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన వ్యక్తులు కమలాపూర్ మండల కేంద్రానికి చెందినఓ మాజీ ప్రజాప్రతినిధి భార్యతో మరో ప్రజా ప్రతినిధి చనువుగా ఉన్నాడని దుష్ప్రచారంచేస్తూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పోస్ట్ చేసి వైరల్ చేశారన్నారు.

బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సెక్షన్ 67తో పాటు మరో మూడు సెక్షన్ల కింద ఏడుగురిపై కేసు నమోదు చేశారు. వీరిలో నలుగురిని బుధవారం అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు.