మద్యం దుకాణాలకు పోటెత్తిన దరఖాస్తులు

మద్యం దుకాణాలకు పోటెత్తిన దరఖాస్తులుహైదరాబాద్: తెలంగాణలో మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా ఆశావహులు పోటెత్తారు. నిన్న ఒక్క రోజే ఏకంగా 15 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య 29 వేలకు చేరుకుంది.

ఒక్కో దరఖాస్తుకు రూ. 2 లక్షల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. దుకాణం వచ్చినా,రాకున్నా ఈ ఫీజును వదులుకోవాల్సిందే. ఫలితంగా దరఖాస్తుల ద్వారానే ఏకంగా రూ. 1200 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా, దరఖాస్తు స్వీకరణ గడువు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.