రేపు మద్యం షాపులు బంద్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హనుమాన్ జయంతి, శోభాయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంటాయని పోలీసులు వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించి మద్యం అమ్మేవారిపై కఠన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర చేపట్టనున్నారు.ఈ క్రమంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. హనుమాన్ శోభాయాత్ర గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్ బన్ లోని హనుమాన్ మందిర్ వరకు కొనసాగనుంది. కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి మరో యాత్ర కొనసాగుతుంది. కర్మన్ ఘాట్ నుంచి చంపాపేట్, కోఠి ఉమెన్స్ కాలేజ్, నారాయణ గూడ మీదుగా తాడ్ బన్ లోని హనుమాన్ మందిర్ వరకు కొనసాగనుంది.